తమిళనాడు దేశీయ వాదం అధ్యక్షుడు నెడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ ఆయన బాంబు పేల్చారు. ప్రభాకరన్ ఇప్పటికీ ఆయన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు ప్రభాకరన్ వస్తారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాకరన్ చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ప్రభాకరన్ బతికి వున్నారని ప్రజలకు ఆయన చెప్పామన్నారని పేర్కొన్నారు. అందుకే తాను మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెబుతున్నట్టు నెడు మారన్ వెల్లడించారు.
2009లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక, ఎల్టీటీఈ మధ్య పోరు జరిగింది. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించినట్టు సైన్యం ప్రకటించింది. ఆ తర్వాత 18 మే 2009న ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంథోనీ కూడా చనిపోయారు.
ప్రభాకరన్ మరణించారని, ఆయన మృతదేహానికి సంబంధించిన ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం అప్పట్లో విడుదల చేసింది. కానీ సుమారు 15 ఏండ్ల తర్వాత ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ నెడుమారన్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.