నవ్విపోదురుగాన నాకేటి సిగ్గు అన్నాడోకవి. ప్రకృతి సౌందర్యానికి పరవశించి రసానుభూతితో ఆయన రాసిన కవిత్వంలోని ఓ మాటది. అయితే ఓ యువ జంట సభ్యతా సంస్కారాలు మర్చిపోయి నడిరోడ్డుపై నిస్సిగ్గుగా శృంగార చేష్టలు సాగించింది.
ప్రియుడు స్కూటర్ నడుపుతుంటే, ప్రియురాలు ఒళ్ళో కూర్చుని అతణ్ణి కౌగిలించుకుని ముద్దులు పెడుతోంది. వెనుక వస్తున్న వాహనదారులలో ఒకరు వారి అసభ్యప్రవర్తనను వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంచలనంగా మారింది.
దీంతో లక్నో పోలీసులు ఈ జంటను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు. లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో నిజమైనదేనని నిర్ధారించారు.
సదరు జంటను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల సాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మోటారు వాహనాల చట్టం, అసభ్యతను వ్యాపింపజేస్తున్నందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
चलती स्कूटी में बीच सड़क इश्क़ का खुल्लम खु्ल्ला इज़हार।
– वीडियो लखनऊ हज़रतगंज का बताया जा रहा है। pic.twitter.com/65aLWkMPdd
— Shubhankar Mishra (@shubhankrmishra) January 17, 2023