సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత... గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స - Tolivelugu

సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత… గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స

సుద్దాల అశోక్ తేజ… ఈ పేరు తెలియాలని సంగీతాభిమానులు ఉండరు. ఎన్నో సినిమాలకు పాటలు రాసిన అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు శస్త్ర చికిత్స జరగనుంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అశోక్ తేజ ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతున్నారు.

ఇదే విషయమై నటుడు ఉత్తేజ్ స్పందిస్తూ మా మామయ్య సుద్దాల అశోక్‌తేజ అనారోగ్యంగా ఉన్నారంటూ సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలు నిజమే. చికిత్స కోసం ఆయన ఈ రోజు ఆస్పత్రిలో చేరనున్నారు. శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరగనుందని తెలిపారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp