మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్‌పై మా మాజీ అధ్యక్షుడు నరేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మా’ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘మా’ లో క్షుద్ర రాజకీయం చేయొద్దని..అవకాశాలు ఇప్పించేందుకే మా ఉందని స్పష్టం చేశారు.
ప్రకాష్ రాజ్ ఒక్కసారైనా ‘మా’ ఎన్నికల్లో ఓటేశారా అని ప్రశ్నించారు. ‘మా’ నిర్వహించిన ఒక్క మీటింగ్‌కైనా అటెండ్ అయ్యారా అని నిలదీశారు. ఎన్నిసార్లు ‘మా’ నుంచి సస్పెండ్ అయ్యారో కూడా చెప్పాలని అన్నారు. మీరే వచ్చారా లేక రెస్టారెంట్ లో డిస్కౌంట్ లా ..ఎవరైనా తెచ్చారా అంటూ సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ మాటలకు ..మ్యానిఫెస్టోకు సంబంధం లేదని నరేష్ విమర్శించారు.
సరైనోడు లేడు కాబట్టే వచ్చానన్న ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఆశ్యర్యం కల్గించాయని చెప్పారు. తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమలో గొప్ప నటులు ఉన్నారని.. వారు తెలియదా అని ప్రశ్నించారు. ‘మా’ కు ప్రెసిడెంట్ గా తెలుగోడు ఉండాలని అన్నారు. మెంబర్‌గా ఉండొచ్చు ..అది గెస్ట్‌గా మాత్రమేనని చెప్పుకొచ్చారు నరేష్.