హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై మా అధ్యక్షుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి ముందు తేజ్ నా ఇంటి నుండే వెళ్లారన్నారు. నా కొడుకు నవీన్, తేజ్ ఇద్దరూ మంచి స్నేహితులని… ఇద్దరూ రైడింగ్ కు వెళ్తుండటంపై చాలాసార్లు హెచ్చరించాలనుకున్నా అని నరేష్ తెలిపారు. 4 రోజుల క్రితం కౌన్సెలింగ్ చేయిద్దామనుకున్నా అన్నారు.
వీరంతా స్పోర్ట్స్ బైక్ ల జోలికి వెళ్లకుండా ఉండేలా చూడాలని నిర్ణయించామని నరేష్ తెలిపారు. గతంలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటిరెడ్డిల కొడుకులు ఇలాంటి ప్రమాదాల వల్లే మరణించారని… వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నారు. కుటుంబాలను, నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఈ బైక్ లు అత్యంత ప్రమాదం అని గతంలోనూ హెచ్చరించామని… బైక్ లపై కఠినంగా ఉండాలని తమ కుటుంబాలు నిర్ణయించినట్లు నరేష్ తెలిపారు.