తమిళ స్టార్ హీరో ధనుష్ “మారన్” సినిమా ప్రముఖ ఓటిటి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 11 నుండి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఇందులో ధనుష్ దేనికీ భయపడకుండా సత్యం వెనుక ఉండే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నటించాడు. అలాగే సముద్రకని పవర్ ఫుల్ పొలిటీషియన్ గా నటించారు. జర్నలిస్ట్ వర్సెస్ పొలిటీషియన్ మధ్య జరిగే కథే మారన్. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.
కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ధనుష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది.