హిండెన్ బర్గ్ పై మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రాథమిక లక్ష్యం మధ్యతరగతి పెట్టుబడిదారుల దురదృష్టంపై లాభాలను ఆర్జించడమేనని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హిండెన్‌బర్గ్ అంత సహాయకారి సంస్థ కాదన్నారు. ఆ సంస్థ ఓ అవకాశ వాది అన్నారు. ఈ విషయంలో పూర్తి భిన్నమైన కోణం ఉందన్నారు. ఆ సంస్థ మధ్యతరగతి పెట్టుబడిదారుని దురదృష్టం నుండి డబ్బు సంపాదించిందన్నారు.
ఈ సంస్థ తమకు అనుగుణంగా సమయానికి నివేదిక విడుదల చేస్తుంటారని,ఆ తర్వాత దాన్ని మాయం చేస్తుంటుందని ఆయన ఆరోపించారు. షేర్లను తగ్గించడం ద్వారా మధ్యతరగతి పెట్టుబడిదారుడి ఖర్చుతో టన్నుల కొద్ది డబ్బులు సంపాదించిన వారందరినీ విచారణ కమిటీ గుర్తించాలన్నారు.
మార్కెట్ మానిప్యులేటర్లను ట్రేడింగ్ నుండి నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైనా నివేదిక ఉంటే అది మొదట సెబీకి లేదా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెళ్లాలన్నారు. ఆ తర్వాత దానిపై వారు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.