కాలేజీ యాజమాన్యానికి తెలియకుండా… ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల్లో ఎంజాయ్ చేయాలని వెళ్లిన విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
మాదాపూర్‌లోని ప్రైవేట్ కాలేజ్ క్యాంపస్ గోడదూకి ఆరుగురు విద్యార్థులు బయటకు వెళ్లారు. రాజేంద్రనగర్‌లో ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలకు అటెండ్ కావడానికి యాజమాన్యానికి తెలియకుండా… గోడ దూకి వెళ్లిన విద్యార్థులు పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా అరంగర్ చౌరస్తాలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
వీరంతా మాదాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్‌టర్మ్ కోచిం గ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరణించి వారిని అభిషేక్, విష్ణులుగా గుర్తించారు.