ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల నుంచి తెరకెక్కుతున్న బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా బయోపిక్ పై గత కొంతకాలంగా సినీవర్గాల్లో చర్చ జరుగుతుంది. సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో రతన్ టాటా గా మాధవన్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా సుధా కొంగర మాట్లాడుతూ రతన్ టాటా బయోపిక్ తీయాలని ఉంది అంటూ మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దీనిపై తాజాగా మాధవన్ స్పందించారు. రతన్ టాటా బయోపిక్ లో తాను నటించడం లేదని, నిజానికి అలాంటి ప్రతిపాదన ఏమీ తన దగ్గరకు రాలేదని స్పష్టం చేశారు.