సమాజానికి నమూనాగా ఉండాల్సిన ఉపాధ్యాయులు తమ బాధ్యతలు మరిచిపోతున్నారు. పదిమందికీ జ్ఞానాన్ని బోధించాల్సిన గురువులు నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. గురు స్థానానికి ఉన్న గౌరవాన్ని మంట గలుపుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా…డబ్బు మీద అత్యాశతో అవినీతికి పాల్పడుతున్నారు.
దేవాలయంలాంటి పాఠశాల భవన నిర్మాణ నిధిల విడుదలకు లంచం తీసుకుంటుండగా ఓ హెడ్ మాస్టర్ ని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడింది.ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మధిర గర్ల్స్ హై స్కూల్ కు చెందిన హెడ్ మాస్టర్ శ్రీదేవి లంచం తీసుకుంటూ దొరికిపోయింది.
మన ఊరు – మన బడిలో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులుకు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు హెచ్ఎం ఎం శ్రీలత 50,000 డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ హెచ్‌ఎంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అందులోనుంచి 25,000 వేల రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
హెచ్‌ఎం వద్ద ఉన్న రూ.25 వేలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అవినీతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అయితే, ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుంచి హెచ్ఎంలు బిల్లులు చేసేందుకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.