మధు యాష్కీ
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వకుండా ప్రజలను మూడు పార్టీలు కలిసి తప్పుదోవ పట్టించారు. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు అధైర్య పడవద్దు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మిత్తి తో సహా చెల్లిస్తాం. తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి ఇచ్చినా ఐక్యమత్యంతో అందరం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సమర్థవంతమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలపడుతుంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై ఉంటాం. బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను చులకనగా చేసి మాట్లాడడం తగదు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే వంద మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అంటే ఎంత దృఢమైనా పార్టీనో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ముఖ్యమంత్రిగా ఏ వర్గ నాయకున్ని అయినా చేయగలదు.