మధుయాష్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్
కేసీఆర్ జీవితమే మోసంతో ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు తలసాని, గంగుల, దానం లాంటి వారిని పక్కన పెట్టుకుని ఆయన ప్లీనరీ నిర్వహించారు. నిజమైన ఉద్యమకారులు రోడ్డుపై ఉన్నారు. ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి.
తెలంగాణకు కేసీఆర్ ఏం చేసారని దేశ రాజకీయాల్లోకి వెళ్తారు. రాజకీయంగా నష్టపోయినా కూడా ప్రజలు సంతోషంగా ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వందల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయి.
టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు బీజేపీతో అంటకాగిన కేసీఆర్ ఇప్పుడు విమర్శిస్తే నమ్ముతామా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి.
టీఆర్ఎస్ కు 30 సీట్ల కంటే ఎక్కువ రావని కేసీఆర్ కు రిపోర్ట్ అందింది. ముక్కోనపు పోటీ కోసమే బీజేపీ ని హైప్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సభ కోసం సమిష్టిగా మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. వీక్ గా ఉన్న చోట మీటింగ్ పెడితే బాగుంటుందని మాత్రమే కోమటిరెడ్డి సూచించారు.