తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ తోపాటు మరో 11 మంది ఆర్మీఅధికారుల దుర్మరణం దేశాన్నిఇప్పటికీ కలచివేస్తోంది.48 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నరావత్ భార్య మధులిక కూడా..సైనిక సంక్షేమంలో తన వంతు కృషి చేస్తున్నారనే విషయం చాలా మందికి తెలీదు. సైనికుల కుటుంబాల సంక్షమం కోసం అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏను స్థాపించారు మధులిక.
ఆర్మీలోని ఉద్యోగుల భార్యలు,పిల్లలు,వారిపై ఆధారపడిన ఇతర కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ఏడబ్ల్యూడబ్ల్యూఏ కృషి చేస్తుంది.మధులిక రావత్..సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు.మరణించిన సైనికుల భార్యలు, దివ్యాంగ చిన్నారులకు సాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మధులిక నిర్వహించారు.ఈ ప్రమాదంలో ఆమె కూడా మరణించటంతో సైనికుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.