మాధురీ దీక్షిత్… ఈ అందాల నటి ఒకప్పటి కుర్రకారుకు కలల రాణి. ఇప్పటికీ ఈమె అందం ఎంతో మందిని కట్టిపడేస్తోంది. ఇప్పటి తరం హీరోయిన్లు కుళ్లుకునేంత ముద్దుగా ఉంటుంది మాధురీ. ఆమె తరచూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
మాధురీ దసరా నవరాత్రుల సమయంలో ఆమె ధరించిన దుస్తులతో ఎప్పటికప్పుడు అభిమానుల ముందుకు వచ్చేది. ఆమె చీర కట్టినా, లెహంగా ధరించిన కుర్ర హీరోయిన్లతో పోటీగా ఉండేది. తాజాగా ఆమె కుర్తా సెట్ ధరించి అందరి మనసులు దోచుకుంటుంది.
నీలి రంగు దుప్పట్టతో తెలుపు పూల దారం ఎంబ్రాయిడీరతో చూడాటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.ఈ తేలికపాటి కుర్తాను స్కాలోప్ హెమ్డ్ పలాజ్జో ప్యాంట్ ను ఆమె ధరించారు. డ్రెస్ కు తగినట్లుగా తెల్లటి ప్రాడా లెదర్ హ్యాండ్ బ్యాగ్, బంగారు లోగో ను కలిగి ఉంది.
అంతేకాకుండా ఆమె డ్రాప్ చెవిపోగులు, ఓవర్ సైజ్ బ్లాక్ సన్ గ్లాసెస్ తో పాటు బ్రాస్ లెట్ ధరించి మరింత క్లాసీగా కనిపిస్తోంది.