ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కు మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. ముంబైలోని సగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ మేరకు విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీ రామ్ వెల్లడించారు.
ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూనే స్వర్గస్తులయ్యారంటూ మాధురి దీక్షిత్ భావోద్వేగానికి లోనయ్యారు. వర్లీ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మాధురి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ ఎమోషనల్ అయ్యారు. బర్డ్ డే విషెస్ చెబుతూ పెట్టిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ విషెస్ తెలిపిన ఆమె.. ఓ కూతురికి తల్లే ఓ మంచి ఫ్రెండ్ అంటుంటారని చెప్పారు. అది నిజమే కదా? అని ఆమె అన్నారు. తన తల్లి తన కోసం చేసినవన్నీ,తనకు నేర్పిన విషయాలన్నీ కూడా తనకు బహుమతులే అంటూ పోస్టు చేశారు.