శవాల మీద పేలాలు ఏరుకుంటూ, శవ రాజకీయాలు చేస్తూ, సిగ్గు లేకుండా పాడెలు మోసింది టీఆర్ ఎస్ నాయకులే అంటూ కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. అగ్నిపథ్ గురించి నిరసనకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ ది ముమ్మాటికీ రాజకీయ హత్యే అంటూ ఆయన ధ్వజమెత్తారు.
అగ్నిఫథ్ ఉద్యమంలో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో తాగుబోతుల రెస్టారెంట్ సమితి నాయకులు శవాలమీద పేలాలు ఏరుకుంటున్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టిన టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, సిగ్గు, శరం, మానవత్వం లేకుండా పాడెమోశారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇచ్చుంటే రాకేష్ మరణించేవాడే కాదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు మోదీ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వక రాకేష్ మరణానికి కారణమయ్యారు.
రాకేష్ పై కాల్పులు జరిపింది తెలంగాణ పోలీసులు.. చంపింది తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం.. వాళ్లే మళ్లీ నిస్సిగ్గుగా పాడె మోస్తూ నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. ఉద్యోగాల కల్పన చేస్తామంటూ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నరేంద్ర మోదీ ఇద్దరూ నిరుద్యోగులను మోసం చేశారు. ఇంటింటికి ఉద్యోగం అంటూ చంద్రశేఖర్ రావు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ నరేంద్ర మోదీ నిరుద్యోగులను దగా చేశారు అంటూ విరుచుకుపడ్డారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో లక్ష 7 వేల ఖాళీలు ఉన్నాయంటూ చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి శాసనసభ సాక్షిగా ప్రకటన చేశారు. వెంటనే వాటిని భర్తీ చేస్తానంటూ చేసిన ప్రకటనకు ఎనిమిదేళ్లు అయినా అమలుకు నోచలేదు.
తాజాగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో లక్ష ఖాళీలున్నాయి.. మరో 24 గంటల్లో నియామక ప్రక్రియ మొదలవుతుంటూ మరోసారి శాసనసభ సాక్షిగా చేసిన ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగానే ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ మంత్రి తారక రామారావు సొంత నియోజకవర్గం సిరిసిల్ల మొదలు.. రాష్ట్రమంతటా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నా చావుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే బాధ్యత అంటూ ఆత్మహత్యలు చేసుకున్న మహబూబబాద్ జిల్లా వాసి ముత్యాల సాగర్, మంచిర్యాల జిల్లా అసంపల్లి మహేష్, నోటిఫికేషన్లు రాక తీవ్రమనస్తాపంతో కాకతీయ విద్యార్థి సునీల్ సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణాలకు పాల్పడ్డారు. నోటిషికేషన్లు రాక వయసు మీరి ఉద్యోగాలు రావన్న బెంగతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారన్నారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు కల్వకుంట్ల కరఫ్షన్ రావుకు, ఆయన దోపిడీ దొంగల కుటుంబ సభ్యులకు కనిపించలేదా? రాకేష్ అంతిమ యాత్రలో పాడెమోసిన మంత్రులు.. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల పాడె ఎందుకు మోయలేదు? ఆయా కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? ఇప్పటికైనా ఆయా కుటుంబాలను పరామర్శించే ధైర్యం రాబందుల సమితి నాయకులకు ఉందా? అంటూ ప్రశ్నించారు.
నియామకాలు కోరితే ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ బిడ్డలకు తాగుబోతుల రెస్టారెంట్ సమితి నాయకులు ఎందుకు సంతాపం తెలపలేదు? ఆ కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం ప్రకటించలేదో?? రాబందుల సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పాలని నేను కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలైవుంటే రాకేష్ మరణించేవాడు. రాకేష్ మరణానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నరేంద్ర మోదీ ఇద్దరూ బాధ్యత వహించాలన్నారు.