దేశంలో బర్డ్ ప్లూ క్రమంగా విస్తరిస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రానున్న పది రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌ను అనుకొని ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు జిల్లాలకు చికెన్ సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేరళలో వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కాకులతో పాటు పలు రకాల పక్షులు అసహజంగా మరణిస్తున్నాయి. కొన్నింటిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపించినట్టుగా అక్కడి అధికారులు చెప్తున్నారు. కాగా కోళ్లలో మాత్రం ఇప్పటివరకు అలాంటి అనుమానిత లక్షణాలేవి లేవని అంటున్నారు.