మధ్యప్రదేశ్ ఇండోర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరు సాధించగా.. తాజాగా మరో రికార్డ్ సృష్టించింది. దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీగా నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీగా రికార్డులకెక్కింది ఇండోర్. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇండోర్.. దేశంలోని మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనికోసం సహకరించిన నగర ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మధ్యప్రదేశ్ సీఎం. నగరంలోని నదులు, కాలువల పరిశుభ్రతకు సంబంధించి ఈ సర్టిఫికెట్ అందిస్తారు.