నాన్న నాకు ఒక పదివేలు ఇవ్వు తెల్లవారే సరికి వాటిన లక్ష చేసి చూపిస్తా.. అని ఓ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇది. అది నిత్యజీవితంలో సాధ్యం కాదంటారు.. కానీ.. అదృష్టం కలిసిసొస్తే ఏదైనా సాధ్యమే అవుతోంది. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది.
పన్నాకు చెందిన చమీలీ బాయ్ కృష్ణా అనే మహిళ కళ్యాణ్ పూర్ బెల్ట్ లో ఉన్న ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం రూ. 200తో డీడీ కట్టి లీజుకు తీసుకుంది. భర్తతో కలిసి 3 నెలలపాటు తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో ఆమెను అదృష్టం వరించింది.
సుమారుగా రూ. 12 లక్షల వరకు విలువ చేసే 2.08 క్యారెట్ల వజ్రం ఆమెకు దొరికింది. అది బ్రైడ్ డైమాండ్ కావడంతో అధిక డిమాండ్ ఉండటంతో.. ఒక్క సారిగా అదృష్టం తలుపుతట్టినట్టైంది. దొరికి డైమాండ్ ను ప్రభుత్వానికి అందజేసింది ఆ మహిళ.
దీంతో ఆమెకు ట్యాక్స్ లు పోగా సుమారుగా రూ. 8 నుండి 10 లక్షల వరకు రావొచ్చని అంచనావేస్తున్నారు. వచ్చిన డబ్బులతో సొంత ఇల్లు కొనుక్కుంటామని చమీలీ బాయ్ చెప్పింది.