ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియని టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆర్ఆర్ ఆర్ సినిమా వరకు వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు. నిజానికి తన సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు రాజమౌళి. హీరో హీరోయిన్ల ఎంపిక విలన్ ఎంపిక ఇలా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ప్లాన్ చేస్తాడు.
ఇకపోతే రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో 2009లో మగధీర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది.
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీహరి, సునీల్, బ్రహ్మానందం, రావు రమేష్,శరత్ బాబు, దేవ్ గిల్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే నిజానికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని కోరికతో ఉన్న రాజమౌళి తన తండ్రి తో చెప్పి చిరుకోసం మగధీర కథ సిద్ధం చేశారట. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా మగధీర లో నటించడానికి చిరంజీవి ఒప్పుకోలేదట.
తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తమ్ముడు కూడా హీరోనే… తెలుసా ఈ విషయం!!
దీంతో మగధీర చిత్రంలో కొన్ని మార్పులు చేసి రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించారు. స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వచ్చేటటువంటి గుర్రపు సన్నివేశాల గురించి కూడా మాట్లాడుతూ చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ చిత్రంలో కొన్ని గుర్రపుస్వారీ సన్నివేశాలను ఆధారంగా రామ్ చరణ్ తో గుర్రపు సన్నివేశాలు తెరకెక్కించామని చెప్పారు. ఇక ఈ సినిమాను 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో అప్పట్లో నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలు పైగా వసూళ్లను సాధించింది.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాకుండా చరణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయింది.
Advertisements
రాజమౌళి తాత ఇచ్చిన కోట్లరూపాయల ఆస్తులు ఎలా పోయాయో తెలుసా ?
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా నటించాడు. మరోసారి నటన పరంగా తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయలను ఈ చిత్రం వసూలు చేస్తోంది.