‘మఘము’ అంటే యజ్ఞం, యజ్ఞ, యాగాలూ, పవిత్రమైనదైవకార్యాలూచేయడానికిఅత్యున్నతమైనది మాఘమాసం అని చెప్పారు పెద్దలు. ఈ నెలరోజులూ ప్రత్యేకమే అయినప్పటికీ మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం. దీనినే మహా మాఘి అని కూడా అంటారు. ఈరోజు చేసేసముద్ర, నదీ స్నానాలు, పూజలుఅపారమైన ఫలాలనుఇస్తాయన్నది శాస్త్రవచనం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం, మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం.. దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదివారంమాఘ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఈ గరుడ వాహనసేవ నిర్వహిస్తూ వస్తోన్నారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు. నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మాఘ పౌర్ణమి కావడం వల్ల ఈ గరుడసేవకు మరింత విశిష్ఠత ఏర్పడింది.
మాఘ పౌర్ణమి గరుడ సేవ, శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సెలవురోజు కూడా కావడంతో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటోంది. దీనికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.
అన్నవరం సత్యదేవుని సన్నిధి మాఘ పూర్ణిమ, పెళ్లి ముహుర్తాలు ఉండటంతో ఖాళీ లేకుండా ఉంది. భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.