మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రేపై చర్యలకు మహా సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఠాక్రే ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాస్లే తెలిపారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహాను పోలీసులు తీసుకుంటున్నారని హోం మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎవరి హెచ్చరికలు భయపడదని ఆయన అన్నారు. న్యాయ నిపుణుల సూచనలు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
మరఠ్వాడా ప్రాంతంలోని ఔరంగబాద్ లో నిర్వహించిన ఓ సభలో ఎంఎన్ఎఫ్ చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం మాట్లాడారు. మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపునకు ఇచ్చిన గడువు ముగియనున్నట్టు గుర్తు చేశారు.
గడువులోగా లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే హిందువులు సైతం వారి మత ప్రదేశాల్లో హనుమాన్ చాలీసాలను లౌడ్ స్పీకర్లలో పెద్ద ఎత్తున ప్లే చేస్తారని ఆయన హెచ్చరించారు. పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నందున ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.