దక్షిణ కాశీ గా పేరు గాంచిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జాతర కు భక్తులు భారీగా తరలి రానున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండి కాక, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి రానున్నారు. ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయంగా అనేక విశిష్టతలను కలిగి ఉంది. బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు కేతకి వనం లో వెలిశాడు. కేతకీ అంటే మొగిలి పువ్వు అని అర్థం. ఇక్కడ వెలసిన ఆ పరమశివునికి కేతకి పుష్పములు తో అర్చించటం వలన కేతకి సంగమేశ్వరుడిగా పేరు గాంచినట్లు స్కంద పురాణం లో ప్రస్తావన ఉందని అంటున్నారు అర్చకులు.
ఆలయంలోని అమృత గుండం లో ఉంటుంది. ఆలయంలోని అమృత గుండం లో స్నానామాచరిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. ఆ గుండం లో అన్నప్రసాదం, పితృదేవతలకు పిందప్రదానం చేస్తే సరాసరి ఆ పిండం కాశి కి చేరుతుందని, పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. శివరాత్రి సందర్భంగా కేతకీ సంగమేశ్వర ఆలయం లో ఉత్సవాలు 18వ తేదీ నుండి ప్రారంభమై 26 వ తేది వరకు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా 21వ తేదీన అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమము, స్వామి వారికి అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఋత్వికరణ, పల్లకి సేవ, కార్యక్రమలు నిర్వహిస్థారు. 23వ తేదీన శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది.
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు ఆలయ కార్యనిర్వాహణ అధికారి. భక్తులు స్వామివారి దర్శించుకుని తరించాలని ఆయన కోరారు.
ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం లో నిర్వహించే జాతర ఉత్సవాల్లో భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నారు.