• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

కోటివరాలిచ్చే దేవుడు ఎములాడ రాజన్న

Published on : February 21, 2020 at 8:00 am

కోడె ను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా అంటూ కోటి వరాలిచ్చే ఎముడాల రాజన్న కొలువైన శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లెంబాలవాటికగా ,ఏమిలేనివాడగా,ఎములాడాగా పిలవబడుతూ క్రమేణా వేములవాడ గా మారి ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణంగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. పట్టణం నడిబొడ్డున ఆలయాలతో నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది.

దక్షిణకాశీగా పేరుగాంచి, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందింది. ఈ క్షేత్రం లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వేడుకే మహా శివరాత్రి. ఈ మహా జాతరను ఈనెల 20 నుంచి 21 వరకు 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతుంది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ స్థలపురాణం, ఆలయ విశిష్టత పట్టణంలో ఆలయాలు, పూజల వివరాలపై తొలివెలుగు.కామ్‌ ప్రత్యేక కథనం.

శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్ధలతో ప్రజలు పరమాత్ముడిని కొలుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. తనలోని శక్తిని జాగృతం చేస్తూ భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకునేదే జాగారం. రాజన్న అని నోరారా పిలుచుకునే రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. వేములవాడ లో పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.వందల సంవ్సతరాల చరిత్ర గల వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది.

స్థల పురాణం:

వేములవాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. వృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యదోషం నివారించుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగాడు. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా దోష నివారణ జరగలేదట. చివరకు బృహస్పతి సూచనతో వేములవాడలోని రాజేరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష నివారణ లభించిందని పెద్దలు చెబుతుంటారు.

భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట.

ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్దమయిన నరేంద్రుడు మొదటి జాములో నిద్రనుండి లేవకపోవడం తో పక్కనే ఉన్న నాంపల్లి గుట్ట నుండి నవనాథ సిద్దులు ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని ఇప్పటికి మొదటి జాములో వారు ధర్మ గుండం ద్వారా నేరుగా వచ్చి మూలవిరాట్టుకు పూజ చేసి వెళుతారని భక్తుల నమ్మకం.తానూ ప్రతిష్టించా లనుకున్న లింగాన్ని ఎవరో ప్రతిష్టించడం చూసి బాధపడుతున్న నరేంద్రుని చూసి శివుడు ప్రత్యక్షమై మరో శివలింగాన్ని ఇచ్చి బాల రాజేశ్వరస్వామి రూపం లో ప్రతిస్టింప జేశారని,ఆయనకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. అందుకే శివుడు విశ్రాంతి కోసం ఎవరికీ చెప్పకుండా కైలాసం నుంచి వేములవాడకు వచ్చాడని , అయన వెంటే నంది వేములవాడకు రావడం తో వృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆలయంలో తనకు కోడెమొక్కులు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.

ధర్మగుండా మహత్యం :

ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని ఇక్కడికి వచ్చే భక్తులు మొదట ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెలను కట్టి తమ తమ కోరికలు చెప్పుకొని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం. ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది. ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది. రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేముల వాడ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ నెలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహా బోధి వృక్షం ఉండేది.

దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది. ఇక్కడ బసచేయడానికి అనువైన ప్రదేశంగా ఉండటం వల్ల బోధి చెట్టు క్రింద సేద తీర్చుకున్నాడు.తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినట్లు అనిపించింది. అంతే చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయం అయి బయటకు కు వచ్చాడు.

అంతే ఆ రోజు బోధివృక్షం క్రింద గల దక్షిణామూర్తి (శివలింగం)కు పూజనాచరించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వరపోతూ ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత జనం అలజడికి మేల్కొని చూడటగా అక్కడ ఒక మహాముని కూర్చుండి, వ్యాధి గ్రస్తులయిన వారికి కోనేటి నీటితో వైద్యం చేస్తూ కనిపించాడు.ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తిని నాకు అతిభయంకరమైన కుష్టు వ్యాధి వ్యాపించినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచరించా కానీ ఈ కోనేటి లో మునగగానే నా వ్యాధి దూరమైంది ఎలా? అని నా సందేహం నివృతి చేయండి స్వామి అంటూ ప్రాదేయ పడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పాడు.ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కల కాలబైరవ జ్వాలా ముకి, బహుముకి దేవతలు కొలువుతీరి ఉన్నారు అందుకే ఈ కోనేటికి కలియుగాంతం వరకు మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.

ఆలయాల పరంపర :

పేరుకే శివాలయమైన శైవంతో పాటు వైష్ణవ పూజలకు అంతే స్థానం ఉంది. రాజన్న ఆలయంలో క్షేత్రపాలకుడిగా అనంతపద్మనాభస్వామి ఉండటం, శ్రీసీతారామచంద్రమూర్తి స్వామివారి ఆలయం ఉండటంతో వైష్ణవపూజలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీరామకల్యాణం ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి తర్వాత పెద్ద వేడుక శ్రీరామనవమే. శైవులు, వైష్ణవులు, జైనులు, ముస్లిం మతస్థులతో పాటు అన్ని వర్గాల వారు కొలిచేక్షేత్రంగా విరాజిల్లుతుంది.

ఆలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, శివ కల్యాణాలు, బాలాత్రిపురసుందరి మాతకు కుంకు మార్చనలు, మహాపూజ, పెద్దసేవ తదితర పూజలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాజన్న గర్భగుడిలో మూలవిరాట్టు శ్రీరాజరాజేశ్వరస్వామి ఎడుమ వైపున శ్రీలక్ష్మీగణపతి, కుడివైపున పార్వతీదేవి ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ముస్లిం దర్గా ఉండటంతో పెద్ద ఎత్తున ముస్లిం, హిందువులు దర్గాతో పాటు ఆలయంలో పూజించడం ఇక్కడ ప్రత్యేకత.మ్యూజియంగా గండాలు తొలగటానికి భక్తులు గండ దీపంలో నూనె పోయడం ఇక్కడి ప్రత్యేకత.

ప్రత్యేక పూజలు

శివరాత్రి రోజున స్థానిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాలయాన్ని మూడు లక్షలకుపైగా భక్తులు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.ఈ దఫా వేములవాడ కు నలుగురు మంత్రులు ఈ పూజలకు హాజరు కానుండగా స్వామి వారికి టిటిడి పట్టువస్త్రాలు అందజేస్తుంది.

 

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

(no title)

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

సలార్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

ఆచార్య టీజ‌ర్ అప్డేట్-వీడియో

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

మారిన మాస్ట‌ర్ మూవీ డిజిట‌ల్ రిలీజ్ డేట్

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్...?

అల్ల‌రి న‌రేష్ నాంది డిజిట‌ల్ రిలీజ్…?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి

ఎర్రకోటను పరిశీలించిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి

హైదరాబాద్ లో కొత్త స్ట్రెయిన్ కలకలం- ఆ 15మందిలో....

హైదరాబాద్ లో కొత్త స్ట్రెయిన్ కలకలం- ఆ 15మందిలో….

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై రంగంలోకి గ‌వ‌ర్న‌ర్

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

శ‌శిక‌ళ విడుద‌ల‌- ట్విస్ట్ ఇచ్చిన సీఎం ప‌ళ‌నిస్వామి

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను...?

హిందుత్వ సెంటిమెంట్ తోనే మేయ‌ర్ సీటుపై టీఆర్ఎస్ క‌న్ను…?

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

తెలంగాణ క‌రోనా-147 కేసులు.. 399 రికవరీలు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)