శివనామస్మరణతో శైవాలయాలు హోరెత్తుతున్నాయి. వేలాది మంది భక్తులు పరమ శివుడిని దర్శించుకునేందుకు శివాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. మహ శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువ జామున నుంచే రుద్రుడి దర్శనం కోసం తరలివస్తున్నారు.. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. భక్తులు ఉపవాసలు ఉండి, జాగరణ చేస్తూ శివున్ని కోలుస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. హన్మకొండలోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, రామప్పలో రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కొడవటూరులోని సిద్దేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మినరసింహ ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కొమురవేల్లి మల్లిఖార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు చేరుకొని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు జాగరణలు చేస్తూ భక్తితో పరమశివుడిని కొలుస్తున్నారు. శివరాత్రి రోజు జాగరణ చేస్తే పుణ్యప్రాప్తి లభిస్తుందనేది భక్తుల నమ్మకం. వేయ్యి జన్మల పుణ్యఫలం ఈ ఒక్క రోజు జాగరణతో లభిస్తుందని భక్తుల విశ్వసిస్తుంటారు.
మహశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాల్లో తెల్లవారుజామునుంచే పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజాలు చేస్తున్నారు. అభిషేకాలు, అర్చనలతో శివుడిని కొలుస్తున్నారు… పాలకుర్తిలోని సోమేశ్వరాలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో రాత్రి 8గంటలకు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామి వారి కళ్యాణం చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ ఆలయాలకు వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్, చత్తీస్‌గడ్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.
ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఉపవాసలు,జాగరణలు చేస్తూ శివునికి ప్రత్యేక పూజాలు చేస్తున్నారు. దీంతో దేవాలయాలన్నీ భక్తులతో రద్ధీగా మారిపోయాయి.