మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కరాత్రిలోనే ఊహించని మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం… ఉద్ధవ్ థాక్రే సీఎం అవుతారని అన్ని పార్టీలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీజేపీ చక్రం తిప్పింది.
బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని మరీ… ప్రమాణ స్వీకారం చేయించటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది.
శివసేనకు అధికార పీఠం దక్కనివ్వమని ముందు నుండి చెబుతూ వస్తోన్న బీజేపీ అనుకున్నదే చేసి చూపించింది. శరద్ పవార్‌తో చక్రం తిప్పిన మోడీ…. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.
అయితే, మోడీతో భేటీ తర్వాత కూడా ఎన్సీపీ అధినేత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. కానీ అనూహ్యంగా ప్రమాణస్వీకారం వెనుక అజిత్ పవార్ తిరుగుబాటు ఉందా…? బీజేపీ అజిత్ పవార్‌తో గేమ్ నడిపించిందా అన్న చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అవుతోంది.