జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామని మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఈ ఆర్టికల్ ని పునరుద్ధరించాలని కేంద్ర పాలిత ప్రాంతంలో అనేకమంది ప్రజలు కోరుతున్నారని ఆమె చెప్పారు. ఇందుకోసం తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని, కానీ ఈ విషయంలో కొందరు ఇస్తున్న హామీలిస్తున్నా ఇది వారి చేతుల్లో లేదని మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ సమస్యపై తాను ప్రజలను తప్పుదారి పట్టించబోనన్నారు.
దీనిపై స్పందించిన మెహబూబా ముప్తీ.. 370 అధికరణంపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జమ్మూ కాశ్మీర్ కి అన్యాయం జరిగింది. దీనిపై మేం పోరాటాన్ని ప్రారంభిస్తాం అన్నారు. బ్రిటిష్ వారి దమనకాండను కాంగ్రెస్ గళమెత్తి ఎలా అణచివేసిందో అలాగే.. ఈ అధికరణాన్ని పునరుద్ధరించాలని, కాశ్మీర్ సమస్యకు కూడా ఫుల్ స్టాప్ పడాలని ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కోరుతున్నారని మెహబూబా ముఫ్తీ తెలిపారు.
గులాం నబీ ఆజాద్ కు భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చునని, బీజేపీ వైఖరి కూడా మరో విధంగా ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు. 370 అధికరణం పునరుద్ధరణకు దాదాపు 350 ఓట్లు అవసరమని, లోక్ సభ, రాజ్యసభలో 175 ఓట్లు ఉన్నాయని, ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని (350) ఓట్లు సాధించజాలదని ఆజాద్-బారాముల్లాలో జరిగిన ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు.
మీరు ఈ ఆర్టికల్ ని పునరుధ్ధరిస్తామని తప్పుడు హామీలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఓట్లకన్నా తక్కువ స్థాయికి పడిపోయింది. అలాంటప్పుడు మీరిస్తున్న హామీలు ఆచరణసాధ్యమేనా అని ఆయన ఆ ప్రశ్నించారు.
ఈ ఆర్టికల్ రద్దుకు ఉద్దేశించి హోం మంత్రి తెచ్చిన తీర్మానానికి నేను అనుకూలంగా ఓటు చేశానని తనను కొందరు విమర్శిస్తున్నారని, కానీ పార్లమెంట్ ఎలా పని చేస్తుందో వీళ్లకు తెలియదని ఆయన ఆరోపించారు.. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చునన్న ప్రచారం ఊపునందుకోవడంతో ఈ అధికరణం పునరుద్ధరణపై మెహబూబా ముప్తీ వంటివారు మళ్ళీ గళమెత్తుతున్నారు.