మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ తీరు వివాదాస్పదమవుతుంది. అధికారుల నియామకాల్లో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన శశాంక్ వైఖరిపై మండిపడుతున్నారు.
ఈ నెల 7వ తేదీన మహబూబాబాద్ డీపీఓగా స్వరూపారాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ నెల 9వ తేదీన ఆమె మహబూబాబాద్ కలెక్టర్ శశాంక్ కు రిపోర్ట్ చేశారు. అయితే స్వరూపరాణిని మహబూబాబాద్ డీపీఓగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ శశాంక్ పట్టించుకోకుండా మరిపెడ ఎంపీడీఓ ధన్ సింగ్ ను ఇన్ ఛార్జ్ డీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్వరూప రాణిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టి కలెక్టర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతుంది.
ప్రస్తుతం నియమించిన డీపీఓను విధుల్లో చేర్చుకోకుండా ఎంపీడీవోకు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.