మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కీర్తి సురేష్ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కీర్తి. ప్రస్తుతం పరశురామ్ శతకంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఓటిటి వేదిక రిలీజైన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఫెయిల్యూర్ అయిన సంగతి తెలిసిందే.