రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే మహారాష్ట్రలోని చెంబూరులోని భరత్ నగర్ లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. శిధిలాల కింద ఇంకా చాలామంది ఉండొచ్చని భావిస్తున్నారు.
కొండను ఆనుకుని ఉన్న గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కొండచరియలు ఇళ్లపై పడడంతో ప్రాణనష్టం సంభవించింది. రెస్క్యూ టీం స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. 15 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అంటున్నారు అధికారులు.