ముందు నుంచి ఊహించినట్టుగానే జరిగింది. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కే దక్కింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కాకుండా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 10 మంది ఉన్నారు. శివసేన నుంచి ముఖ్యమంత్రి కుమారుడు ఉద్దవ్ ఠాక్రే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్సీపీ నుంచి 10 మంది కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులయ్యారు . కాంగ్రెస్ కు 8 కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కాయి. శివసేన నుంచి ఆరుగురు కేబినెట్, ముగ్గురు సహాయ మంత్రులున్నారు. కేఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ మంత్రిగా…ఇండిపెండెంట్ కు సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. మధ్యాహ్నం విధాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.