మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్ కు సమర్పించనున్నట్టు చెప్పారు. 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి ఫడణవీస్,ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు తగిన మెజార్టీ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫడణవీస్ 4 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. హిందుత్వ సోనియా గాంధీ కాళ్ల దగ్గర పడి వుందని పరోక్షంగా శివసేనను ఉద్దేశించి అన్నారు.