ఉల్లి ధరల పెరుగుల, దేశ ఆర్ధిక పరిస్థితిపై శివసేన బీజేపీనే లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మందగమనం, ఉల్లి ధరల పెరుగుల ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదని శివసేన అధికారిక పత్రిక ”సామ్నా”లో రాసింది. కిలో ఉల్లి ధర రూ.200 చేరిందని…ఈ సమస్యపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం చిన్న పిల్లల మాదిరిగా ఉందని సామ్నా పేర్కొంది. తాను ఉల్లి, వెల్లుల్లి తిననని..తనను ఉల్లి గురించి అడగవద్దని ఆర్ధిక మంత్రి చెప్పడం బట్ట చూస్తే ప్రధానికి ఉల్లి సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేనట్టుందని సామ్నాలో రాశారు. మోదీ ప్రధాన మంత్రి కాక ముందు ఉల్లి ధర పెరుగుదలపై ఆవేదన వ్యక్తం చేసినట్టు సామ్నాలో పేర్కొంది.