మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపొతోంది.
ఇలాంటి నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో అఘాడీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
పార్టీని వీడిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే దానిపై వారు సకాలంలో స్పందించలేదన్నారు. వారంతా ఇప్పుడు ముంబైకి రావాలని తామంత డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.
దమ్ముంటే రెబెల్ ఎమ్మెల్యేలు బల నిరూపణ చేసుకోవాలని సవాల్ విసిరారు. మరో రెండున్నరేండ్ల పదవీ కాలాన్ని శివసేన పూర్తి చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.