మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై 24 గంటల్లోగా బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి ఫడణవీస్ ను ఆదేశించింది. మద్దుతు లేకపోయినప్పటికీ ఫడణవీస్ చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని… బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. బలపరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ పద్దతిని అనుసరించ వద్దని అంది. బలపరీక్ష ఆలస్యం అయినా కొద్దీ ఎమ్మెల్యేల కొనుగోలు జరిగే అవకాశం ఉంటుందని…ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ బల నిరూపణే సరైన మార్గమంది. బలపరీక్ష అనంతరం బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యేలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించేలా చూడాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని సుప్రీంకోర్టు ఆదేశించింది.