మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, శివసేన ఎమ్మెల్యే, ఆధిత్య ఠాక్రే కు Z కేటగిరి సెక్యూర్టీని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు ఇప్పటి వరకున్న X కేటగిరి సెక్యూర్టీని తొలగించినట్టు అధికారులు తెలిపారు. రాజ్యసభ సభ్యుడైన టెండూల్కర్ ఇంటి నుంచి బయటకు వెళ్తే పోలీస్ ఎస్కార్ట్ నిస్తారు. ఆథిత్య ఠాక్రే, సచిన్ టెండూల్కర్ తో పాటు 90 మంది వీఐపీల సెక్యూర్టీని సమీక్షించిన పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో Y+ సెక్యూర్టీ ఉన్న ఆధిత్యా ఠాక్రేకు ఇప్పుడు Z కేటగిరి… ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ కు Z+ సెక్యూర్టీ రక్షణ కల్పించాలని అధికారులు నిర్ణయించారు.