మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ బీజేపీ ఖాతాలో పడిపోయిందని అంతా అనుకున్నా… శివసేన బీజేపిని ఇరుకున పెడుతూనే ఉంది. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకోని చెప్పినా… ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం వెనక్కి తగ్గటం లేదు. శనివారంతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. అంటే ఆదివారంలోపు కొత్త ప్రభుత్వం ఎన్నిక కావాల్సిందే. లేదంటే రాష్ట్రపతి పాలన విధించటం తప్పనిసరి.
అయితే, బీజేపీ ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటుందో అన్న భయంతో ఎన్సీపీ, కాంగ్రెస్ సహ శివసేన ముందుగానే జాగ్రత్తపడ్డాయి. ఓ వైపు బీజేపీతో చర్చలు జరుపుతూనే… శివసేన తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రదేశానికి తరలించింది. శివసేన ఎమ్మెల్యేలు కూడా తమ నాయకుడు థాక్రే చెప్తున్నట్లు 50-50 ఫార్మూలాకే పట్టుబడుతున్నారు. పైగా గవర్నర్ కూడా ఇప్పటికే ఈ విషయంపై న్యాయసలహ కూడా కోరిన నేపథ్యంలో… మహా రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా మొదలైంది.
మరోవైపు శివసేన మాత్రం ఎలాగైనా సీఎం పీఠంపై తమ భవిష్యత్ నాయకుడు ఆదిత్య థాక్రేను కూర్చోబెట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంది. ఇటు బీజేపీ కూడా సీఎం ఖుర్చీ తప్పా మంత్రుల సంఖ్య, పోర్ట్‌పోలియోలపై వెనక్కి తగ్గేందుకు ఓకే అంటూ సంకేతాలిస్తోంది. దీంతో… మహా రాజకీయం శుక్రవారం ఎటు టర్న్ తీసుకుంటుందో అని ఆసక్తి మొదలైంది.