మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు రోజుకు ఉధృతి కొత్త మార్క్ చేరుకుంటోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాలు పాత రికార్డులను గుర్తుకు తెస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 16 వేల మార్క్ చేరువలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తం 15,817 మంది కొత్తగా కరోనా బారినపడగా..56 మంది మరణించారు.
తాజాగా నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 22.82 లక్షలకు, మరణాల సంఖ్య 52,723కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,485 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా తీవత్ర కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తోంది ప్రభుత్వం. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అకోలా, పర్భణి జిల్లాల్లోనూ మూడు రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.ఇక పుణెలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.