మహారాష్ట్ర హోంశాఖ మంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అవినీతి ఆరోపణలు చేయటం, ప్రతి నెల 100కోట్ల రూపాయలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టాడన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే అంశాన్ని దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
15రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు సహకరించేందుకు గాను హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ థాక్రేకు పంపించారు.
ఇన్నాళ్లుగా ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గని ఆయన… ఇప్పుడు రాజీనామా చేయటం మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయనపై ఇంటా బయట ఒత్తిడి పెరగటంతోనే రాజీనామా చేసినట్లు పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.