మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం ముగిసిందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. లౌడ్ స్పీకర్లపై దేశంలో ఒక విధానాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.
లౌడ్ స్పీకర్ల వివాదం ముగిసిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. చట్టం ప్రకారం పనులు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రంలో శాంతి నెలకొని ఉందన్నారు.
కానీ రాష్ట్రంలోని పరిస్థితిని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం ఇచ్చిందన్నారు.
మరో వైపు రాష్ట్రంలో మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పుణె శాఖ డిమాండ్ చేసింది. లౌడ్ స్పీకర్లను తొలగించని పక్షంలో రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల ముందు హనుమాన్ చాలీసాను పెద్ద సౌండ్ తో ప్లే చేస్తామని హెచ్చరించారు.