ఖర్మ ఏం చేస్తాం ..! కన్నందుకు తప్పుతుందా…!? అనుకున్నాడు ఆతండ్రి. కొడుకును పదోతరగతి గట్టెక్కించడానికి నడుం బిగించాడు.కన్నపాపానికి కన్న తండ్రే కొడుక్కు పదోతరగతి పరీక్షల్లో స్లిప్పులు అందిచాడ.పాపం ! ఆ పుత్రోత్సాహమే అతన్ని పోలీసులకి పట్టించింది.
మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జల్గావ్ జిల్లా చోప్రా తహసీల్ అడవాడ్ గ్రామంలోని నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో విద్యార్థులు మరాఠీ పరీక్ష రాస్తున్నారు.
ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న తన కొడుకుకు సాయం చేయాలని ఓ తండ్రి నిర్ణయించుకున్నాడు.కొన్ని స్లిప్పులు పట్టుకుని పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాడు. తన కొడుకు ఏ గదిలో ఉన్నాడోనని వెతుకుతుండగా విధుల్లో ఉన్న పోలీసులు గమనించి హెచ్చరించారు. అక్కడి నుంచి దూరంగా పంపించారు.
కాసేపటికి ఆ తండ్రి మరోమారు ప్రయత్నించేందుకు పరీక్ష కేంద్రం దగ్గరికి వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడంతో విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు.
సదరు తండ్రిని ఓ పోలీస్ అధికారి లాఠీతో చితకబాదాడు. ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
मुलाला कॉपी पुरवायला गेलेल्या बापाला पोलिसांकडून बेदम चोप, व्हिडिओ व्हायरल pic.twitter.com/RiF402O2X6
— Kiran Balasaheb Tajne (@kirantajne) March 4, 2023