దేశంలో ఒమిక్రాన్ కేసుల లెక్క పెరిగింది. ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్ లో ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తికి కొత్త వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై వచ్చిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు అధికారులు. అతడితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. తాజా కేసుతో ఇప్పటిదాకా నలుగురు ఒమిక్రాన్ బారిన పడినట్లు కన్ఫామ్ అయింది.