ఓ మంత్రి ఇద్దరు వ్యక్తులపై దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా వారిపై చేయి కూడా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…
శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గానికి చెందిన దాదా భూసే రాష్ట్ర ఓడరేవులు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల మంత్రి ఓ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులపై మంత్రితో పాటు ఆయన అనుచరులు అధికార దర్పాన్ని ప్రదర్శించారు.
పోలీసుల చూస్తుండగానే సదరు వ్యక్తులను మంత్రి తిట్టాడు. అనంతరం వారి చెంపలపై గట్టిగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు. పోలీసులు ఎదుటే మంత్రి దాదా భూసే ప్రజలను తిట్టారని, వారిని కొట్టారని ఆయన విమర్శించారు.
మంత్రిపై ముఖ్యమంత్రి, పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. తనపై బీజేపీ నేత ఒకరు తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు. తన జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నారంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.