తనకు భద్రత కల్పించాలంటూ మోడల్, సోషల్ మీడియా సెన్సేషనల్ భామ ఉర్ఫి జావేద్ చేసిన అభ్యర్థనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని ముంబై పోలీసు కమిషనర్ కు లేఖ రాసింది. నీ పై దాడి చేస్తానని, నీ అంతు చూస్తానని బీజేపీ నేత చిత్రా వాఘ్ తనను బెదిరించారని, పైగా తనపై ఫిర్యాదు చేశారని ఉర్ఫి జావేద్ ఆందోళన వ్యక్తం చేసింది.
తన ఇంటి బయట తనకు రక్షణ ఉండదని తాను భావిస్తున్నానని పేర్కొంది. నాకు సెక్యూరిటీ కల్పించండి.. నాకు ప్రాణ హాని ఉంది అని ఆమె తన లేఖలో తెలిపింది. ఇటీవలే ఈమె మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలీ చకంకర్ ను కూడా కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ముంబై పోలీసులు ఈమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
ఉర్ఫి జావేద్ బహిరంగ ప్రదేశాల్లో అసభ్య దుస్తులతో కనిపిస్తూ యువతను రెచ్చగొడుతోందని, ఆమె చేష్టలు అశ్లీలకరంగా ఉంటున్నాయని మహారాష్ట్ర బీజేపీ మహిళా విభాగం చీఫ్ చిత్రా వాఘ్ ఆరోపిస్తూ.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఉర్ఫి ..నిత్యం ఏదో ఒక పోస్ట్ తో వార్తల్లో ఉంటోంది. లేటెస్ట్ ఫ్యాషన్.. విభిన్నంగా ఉండే ఔట్ ఫిట్స్ లో కనిపిస్తుంటుంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ… ఇటీవల ఈమె డ్రెస్ ని పూర్తిగా బ్లేడ్స్ తో రూపొందించారు. గత అక్టోబరులో కూడా ఉర్ఫిపై ఢిల్లీలో పోలీసు కేసు నమోదయింది.