మహారాష్ట్ర శాసనసభ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కొలాంబ్ కర్ ను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నియమించారు. కాళిదాస్ కొలాంబ్ కర్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాళిదాస్ వడాల నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియార్టీ ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం ఆనవాయితీ. దీంతో ఎనిమిది ఎమ్మెల్యేలను పరిశీలించిన తర్వాత కాళిదాస్ ను ఖరార్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం బుధవారం సాయంత్రం లోగా మొత్తం ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.