సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. అయితే మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మహర్షి. అయితే ఆ ఏడాది ఆ సినిమాకు గాను సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు గా మహేష్, సినిమాగా మహర్షి, దర్శకునిగా వంశీ పైడిపల్లి, నిర్మాతగా దిల్ రాజు లకి గాను వరుస అవార్డులు లభించాయి.
ఇక 2020కి గాను అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీకి బెస్ట్ నటుడు, బెస్ట్ సినిమా, బెస్ట్ దర్శకునిగా త్రివిక్రమ్, హీరోయిన్ గా పూజా హెగ్డే, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కి అవార్డులు వచ్చాయి. దీనితో ఈ రెండు సినిమాలు అవార్డ్ ల పరంగా క్లీన్ స్వీప్ చేశాయి.