మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే వీటి తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమా ఎవరి దర్శకత్వంలో వస్తుందనేది మెగా ఫ్యాన్స్ లో ప్రశ్నార్థకంగా మారింది.
మొదట మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్ పైకి రావడం కష్టతరంగానే కనిపిస్తుంది. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ విక్కీ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వంశీ కూడా ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. ఇదంతా చూస్తుంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంతా తొందరగా పట్టాలెక్కేలా కనిపించట్లేదు.