అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 14న ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ సినిమా కు సంబంధించి ఓ లవ్ సాంగ్ ను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. చెప్పకే..చెప్పకే అనే పాటను రేపు ఉదయం 10.35 గంటలకు రష్మిక మందన్న రిలీజ్ చేయబోతోంది.