కోల్ కతాలో ఓ దుర్గా మండపంలో మహాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించారు. అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో మహాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించడంతో వివాదం మొదలైంది. మండపంలో దుర్గామాత కాళ్ల కింద ఉండే మహిషాసురుడికి గాంధీ ముఖాన్ని తగిలించారు.
దీనిపై కేంద్ర హోం శాఖకు సమాచారం అందింది. దీంతో కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. వెంటనే ఆదేశాలు జారీచేయడంతో ఆ ముఖాన్ని పూజా నిర్వాహకులు మార్చివేశారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఫిర్యాదు తర్వాత పోలీసులు చేసిన సూచనల మేరకు విగ్రహం రూపు రేఖలను నిర్వాహకులు మార్చారు.
దీనిపై అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామిని ఓ ఆంగ్ల మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ…. గాంధీజీని నిజమైన అసురుడిగా తాము భావిస్తామన్నారు.
గాంధీజీ నిజమైన అసురుడని ఆయన అన్నారు. కాబట్టే దేవతా మూర్తిని తాము అలా తయారు చేశామని వివరించారు. మహాత్మా గాంధీని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోందన్నారు. తామూ మూర్తిని బలవంతంగా తొలగించి దానిలో మార్పులు చేశామన్నారు.
తమపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా ఒత్తిడి తెచ్చిందన్నారు. గాంధీజీ అన్ని చోట్ల నుంచి తొలగించాలని ఆ స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలని తాము అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీన్ని అన్ని పార్టీలు ఖండించాయి. ఇలాంటి పని చేసింది నిజమైన హిందూ మహా సభ కాదని బెంగాల్ హిందూ మహాసభ స్పందించింది.