ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. ఎంతోమంది యువత ఆయన ఇన్స్‌ర్పేషన్‌గా తీసుకుంటారు. ఆయన చెప్పే బిజినెస్ పాఠాలను వింటూ ఆయనలాగా అవ్వాలని ఎంతో మంది అనుకుంటారు. ఆనంద్ మహీంద్రా వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వైవిధ్యభరితమైన వీడియోలు షేర్ చేస్తూ చాలామందిని ఇన్‌స్పైర్ చేసే బిజినెస్ పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఆయనలో ఒక సరదా మనిషి కూడా ఉన్నట్టు నిరూపించుకుంటూ ఉంటారు. అయితే, తాజాగా ఆయన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి ఓ కొత్త బిజినెస్ పాఠాన్ని నేర్పిస్తోంది.
టీం వర్క్‌కి ఉన్న ప్రాధాన్యతను వివరించేలా ఒక ఐడియాను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు ఒక ఫన్నీ వీడియోను ఉదాహరణగా తన పోస్ట్‌లో జోడించారు. అదేంటంటే.. ఓ పార్కింగ్ స్లాట్‌లో ఒక చిన్న తినే పదార్ధం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి. అప్పటికే ఆ ఆహార పదార్ధం పిల్లి నోటికి అందేంత దగ్గరలోనే ఉంటుంది. కానీ, అక్కడ ఉన్న రెండు కాకులు ఒక టీంగా పని చేసి.. ఆ ఆహార పదార్థాన్ని పిల్లి దగ్గర నుంచి లాక్కుంటాయి. ఇక్కడ బలం కన్నా కలిసి పనిచేయటం వల్ల ఎలా విజయం సాధించవచ్చు అనేది మనందరం నేర్చుకోవాలని ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్స్ కు సూచించారు.
అద్బుత ఫలితాలను సాధించటానికి టీం వర్క్ ఎలా ఉపయోగపడుతుందో గ్రహించాలని ఆయన వ్యాఖ్యానించారు. పని ఏదైనా, ఎంత కష్టమైనదైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేసుకోవాలంటే ఒంటరిగా కన్నా టీంగా పనిచేస్తే విజయం తప్పదని ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలని మహీంద్రా అంటున్నారు.
“గుర్తుంచుకోండి.. మీరు టీంగా కలిసి పని చేస్తే మీరు ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటారు” అని పేర్కొంటూ హ్యాష్‌ట్యాగ్ MondayMorning ని జోడించారు. ఇక, మహీంద్రా తాజాగా చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది.
Remember…you’re always going to be more effective if you work collaboratively with a team.. 😊 #MondayMorning pic.twitter.com/lsKKKuJbcc
— anand mahindra (@anandmahindra) March 28, 2022
Advertisements